హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత
Bussiness

హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) హర్యానాలోని మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు  విఫలం కావడంతో సంస్థ ఈ  నిర్ణయం తీసుకంది.   సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు  సంస్థ  నోటీసు విడుదల చేసింది.

యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య సోమవారం జరిగిన  సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, కార్మిక సంఘాలు, ఇతర  కాంట్రాక్ట్ సిబ్బంది దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ  ఆరోపిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా నోటీసులిచ్చారు.  యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి  తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు,  కంపెనీ ప్రాంగణంలో  చట్టవిరుద్ధంగా  నిరసనలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు.  ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టం చేయలేదు. అయితే ప్లాంట్‌లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు  సమాచారం ఇస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *