గోవాలో రమ్యకృష్ణ.. పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. రొమాంటిక్ అప్‌డేట్
Entertainment

గోవాలో రమ్యకృష్ణ.. పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. రొమాంటిక్ అప్‌డేట్

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌కి ప్రధాన పాత్ర ఉంటుందనే సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ మొదలుకొని నటీనటులు, రిపీట్ కాంబినేషన్స్ లాంటి వాటిలో ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు కొందరు దర్శకనిర్మాతలు. అలాంటి వారిలో ఒకరు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన తాజా సినిమా రొమాంటిక్ కోసం ఓ సెంటిమెంటల్ లొకేషన్‌లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో చూద్దామా..

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. అయితే అప్పుడు దర్శకుడిగా అయితే.. ఇప్పుడు నిర్మాతగా. ఎంతైనా మల్టీటాలెంటెడ్ పర్సన్ కదా!. పూరి జగన్నాథ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది ‘రొమాంటిక్’ మూవీ. ఇప్పటికే ఈ సినిమా

తన కొడుకు ఆకాష్ పూరీని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మేరకు తన స్వీయ దర్శకత్వంలో కొడుకు హీరోగా పెట్టి ‘మెహబూబా’ సినిమా రూపొందించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో మరో దర్శకుడికి తన కొడుకు బాధ్యతను అప్పజెప్పి నిర్మాతగా రొమాంటిక్ సినిమా తీస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *