బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!
Sports

బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!

హైదరాబాద్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మాటలు నాకు ఎంతో ప్రేరణ కలిగించాయని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. నాగ్‌‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

రోహిత్‌ శర్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే మూడో టీ20లో తాను అద్భుత ప్రదర్శన చేయగలిగానని దీపక్ చాహర్‌ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్ మాట్లాడుతూ “రోహిత్‌ నా వద్దకు వచ్చి ‘చాహర్‌.. ఈ రోజుకి నువ్వే బుమ్రావి. కీలక సమయంలో నీతో బౌలింగ్‌ చేయిస్తా’ అని అన్నాడు. ఈ మాటలు నాకు ఎంతో ప్రేరణ కలిగించాయి” అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *