సాయంత్ర సమయంలో పింక్ బాల్‌తో ఇబ్బందులు: డే/నైట్ టెస్టుపై పుజారా
Sports

సాయంత్ర సమయంలో పింక్ బాల్‌తో ఇబ్బందులు: డే/నైట్ టెస్టుపై పుజారా

హైదరాబాద్: టీ20 సిరిస్ ముగిసింది. మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక, అందరి దృష్టి పింక్ బాల్ టెస్టుపై పడింది. నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు కోసం ఇప్పటికే క్యాబ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

పింక్‌ బాల్‌తో ఆడిన అనుభవం కోల్‌కతా డే/నైట్‌ టెస్టులో తనకు సహకరిస్తుందని టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా చెప్పుకొచ్చాడు. 2016 దులీఫ్‌ ట్రోఫీలో పుజారా ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో జరగనున్న తొలి డే/నైట్ టెస్టుపై పుజారా మాట్లాడుతూ “పింక్ బాల్‌తో ఆడేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నా” అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *