India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ
Sports

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ

హైదరాబాద్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆఖరి టీ20లో రోహిత్ శర్మ(2) పరుగులకే పెవిలియన్‌కు చేరి అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంగ్లా బౌలర్ సైపుల్ ఇస్లామ్ వేసిన బంతిని ప్లిక్ చేయబోయిన రోహిత్ శర్మ బౌల్డయ్యాడు. ఆఫ్‌స్టంప్‌కి వెలుపల పడిన బంతి రోహిత్ శర్మ బ్యాట్ ఎడ్జిని తీసుకుని లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *